హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పోలీస్ వ్యవస్థ బలోపేతం

ప్రకాశం: మార్కాపురం జిల్లాలో ఏర్పడిన 9నెలల అనంతరం ప్రత్యేక ఎస్పీ నియామకంతో పోలీసు వ్యవస్థ బలోపేతం కానుంది. పోలవరం OSDగా పనిచేసిన పంకజ్‌కుమార్ మీనా మార్కాపురం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి 400-450మంది పోలీసు సిబ్బందిని కేటాయించే అవకాశం ఉంది. స్పెషల్ బ్రాంచ్, DCRB, మహిళా, ఇంటెలిజెన్స్, CCS, ఐటీకోర్, ట్రాఫిక్ విభాగాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.