హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

అన్నమయ్య: మహిళల భద్రతే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఆర్కే వ్యాలీ ఎస్సై శ్రీప్రియ తెలిపారు. ఆదివారం ట్రిపుల్‌ఐటీ విద్యార్థినులకు మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. నిజజీవితంలో చోటుచేసుకున్న పలు సంఘటనలు, కేసులను ఉదాహరణలుగా వివరించారు.