హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీఐ అహ్మద్ అలీకి పోలీసుల నివాళులు

NTR: నున్న సీఐగా పనిచేస్తున్న అహ్మద్ అలీ గుండెపోటుతో విజయవాడలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి విజయవాడ ధర్నా చౌక్ వద్ద పోలీసులు ఆయనకు నివాళులు అర్పించారు. అహ్మద్ అలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పోలీసులు, ఆయన సేవలను స్మరించుకున్నారు. పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది అహ్మద్ అలీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.