హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడి మృతి.. హత్యా? ఆత్మహత్యా?

E.G: తాళ్లపూడి మండలం మలకపల్లిలో డ్రైవర్ బొబ్బరాడ శివప్రసాద్(31) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం తెల్లవారుజామున పంచాయతీ గోడ పక్కన మురికి కాలువలో అతడు శవమై కనిపించాడని వాపోయారు. ఓ మహిళ తరచూ ఫోన్ చేసి వేధించేదని, ఆమె కుటుంబంపై అనుమానం ఉందని మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.