హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే దాట్లను కలిసిన ప్రత్యేక అధికారి

కోనసీమ: ఐ.పోలవరం మండల ప్రజా పరిషత్‌ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఆడిట్‌ అధికారి ఎ.వి.వి. సత్యనారాయణ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును క్యాంపు ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా మండల పాలనా వ్యవహారాలు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. నూతన ప్రత్యేక అధికారి సత్యనారాయణకు ఎమ్మెల్యే సుబ్బరాజు శుభాకాంక్షలు తెలిపారు.