AKP: ఈ-సర్వీస్ రికార్డ్ (ఈఎస్ఆర్) నమోదుకు ప్రభుత్వం మరింత గడువు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ డిమాండ్ చేశారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 30తో గడువు ముగియనున్నందున ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గడువు పొడిగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ-సర్వీస్ రికార్డ్ నమోదుకు గడువు పెంచాలి'


