హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు చిత్తూరులో పీజీఆర్ఎస్

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను జిల్లా ఎస్పీ తుషార్ డూడీతో పాటు జిల్లాస్థాయి పోలీసు అధికారులకు నేరుగా తెలియజేసి పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు.