WGL: నగరంలోని ఎల్లంబజారులో ఏర్పాటు చేసిన 51 అడుగుల భారీ గణపతి విగ్రహం నిమజ్జనం ఉన్నచోటనే దిగ్విజయంగా పూర్తయింది. భక్తుల కోలాహలం మధ్య ఫైర్ ఇంజన్లతో నిర్వాహకులు నిమజ్జన ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం డీజే పాటలకు చిన్నారులు, యువకులు, స్థానికులు హుషారైన స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ ప్రక్రియను చూసేందుకు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
తెలంగాణ
VIDEO: పూర్తయిన ఎల్లం బజార్ గణనాథుని నిమజ్జనం


