హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ స్థాయిలో మెరిసిన మన పల్లె కుర్రాడు

BPT: కర్లపాలెం (మం) నల్లమోతువారిపాలెంకు చెందిన యువ పరిశోధకుడు గరిగంటి సుధాకర్‌ను ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఘనంగా అభినందించారు. సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యులకు అందుబాటులో ఉండే సోలార్ రీఛార్జ్ బ్యాటరీలను తయారుచేసి, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డును గ్రహించడం గర్వకారణమని కొనియాడారు.