హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాట్‌లో తెనాలి బాలుడి అరుదైన రికార్డు

GNTR: అమెరికా సాట్ పరీక్షలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రవాస బాలుడు ఆశ్రిత్ తాళ్లూరి అద్భుత ప్రతిభ కనబరిచాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే 1,600 మార్కులకు నూరు శాతం స్కోరు సాధించాడు. ఇతని తల్లిదండ్రులు 2008లో జార్జియాలో స్థిరపడ్డారు. చదువుతో పాటు చెస్, తైక్వాండో, విమానం నడపడంలో ఇతడు శిక్షణ పొందుతున్నాడు.