SDPT: జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లికి చెందిన నాచారం భాస్కర్ గౌడ్(37) గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని కానిస్టేబుల్ సత్యనారాయణ పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుడి కుమార్తెలు రక్షిత, అక్షితలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఇద్దరు బాలికల పేరిట ప్రతి ఏటా రూ.50 వేల చొప్పున 15 ఏళ్ల పాటు పొదుపు చేస్తానని హామీ ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు.
తెలంగాణ
ఆపదలో అండగా నిలిచిన కానిస్టేబుల్


