హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారుల సత్తా

MBNR: హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. మహిళల విభాగంలో నిర్మల 5,000, 10,000 మీటర్ల పరుగు పందెాల్లో రెండు రజత పతకాలు సాధించారు. అండర్-16 విభాగంలో పూజ 600 మీటర్ల రేసులో కాంస్య పతకం గెలుచుకున్నారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి రమణ, కోచ్‌లు, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.