హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైభవంగా పోలేరమ్మ ఘటోత్సవం

CTR: వెంకటగిరి పోలేరమ్మ జాతరలో భాగంగా మొదటి ఘట్టమైన అమ్మవారి ఘటోత్సవం ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. జీనిగలవారి వీధిలోని చాకలి మండపం వద్ద ఘటం కుండలకు బలిజ కుటుంబానికి చెందిన పత్తివారు పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఘటం కుండల ఊరేగింపు రాజావారి వంటగదికి చేరుకోగా, రాజావారి అనుచరులు పూజలు నిర్వహించారు.