హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూమి రిజిస్ట్రేషన్ పేరుతో ఘరానా మోసం: రూ.29 లక్షలతో పరార్

KNR: బెజ్జంకి మండలం శనిగరంలో ఏడు గుంటల భూమి ఇప్పిస్తామని నమ్మించి, ఓ మహిళ వద్ద రూ.29 లక్షలు కాజేసిన ఘరానా మోసం వెలుగుచూసింది. తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ రిజిస్ట్రేషన్ డ్రామా ఆడి నగదు కాజేసినట్లు బాధితురాలు రషీదా తబ్బుసుమ్ ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.