హైదరాబాద్: 28°C
తెలంగాణ

శూన్య కర్బన ఉద్గారాలపై అవగాహన

NRML: నిర్మల్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శూన్య కర్బన ఉద్గారాల దినోత్సవాన్ని టీఎన్‌జీవో భవన్‌లో నిర్వహించారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి సౌర, పవన విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలని జిల్లా అధ్యక్షుడు షేక్ రఫీక్, రాష్ట్ర కార్యదర్శి గజపల్లి నర్సయ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు.