హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ పునరుద్ధరించాలి'

KRNL: ఎమ్మిగనూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్ ప్లాంట్‌ను వెంటనే పునరుద్ధరించి రోగులకు ప్రాణవాయువు అందించాలని ఇవాళ సీపీఐ పట్టణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆక్సిజన్ ప్లాంట్ ముందు నిరసన చేపట్టిన అనంతరం ఆసుపత్రి వైద్యుడికి వినతిపత్రం అందజేశారు. ప్లాంట్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చి రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.