హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లగొండ నయాగరాకు కొత్త కళ..!

NLG: మర్రిగూడ మండలం అజ్జలపురం అడవుల్లోని శ్రీ బుగ్గ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలోని బుగ్గ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండ నయాగరాగా పేరొందిన ఈ జలపాతాన్ని చూసేందుకు వర్షాకాలంలో సెలవు రోజుల్లో వేలాది మంది సందర్శకులు వస్తుంటారని తెలిపారు. ప్రకృతి అందాలు, మోదుగు చెట్ల పువ్వుల వాసన సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నారు.