హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి PMNRF చెక్కు అందజేత

SRD: ఖేడ్ మండలం మద్వార్ గ్రామానికి చెందిన పుల్కంటి జైపాల్ కుటుంబానికి ప్రధానమంత్రి సహాయ నిధి (PMNRF) నుంచి మంజూరైన రూ. 3 లక్షల ఆర్థిక సహాయం చెక్కును ఎంపీ సురేష్ షెట్కర్ ఆదివారం అందజేశారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఈ చెక్కును ఆయన స్వయంగా అందజేశారు. కష్టకాలంలో ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నందుకు ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు.