హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీలో చేరిన విద్యావేత్త మంద రమేష్

MHBD: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన విద్యావేత్త మంద రమేష్ BJPలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంద రమేష్ మాట్లాడుతూ మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నచ్చి BJPలో చేరానని చెప్పారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.