హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

KDP: వీరపనాయునిపల్లె మండలం తలపనూరులోని శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. పాయసంపల్లె, పెదనపాడు, కీర్తిపల్లి తదితర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు చేసి చల్లను నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ధర్మకర్త నాగిరెడ్డి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.