యాదాద్రి భువనగిరి జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యారత్న అవార్డుల గురుపూజోత్సవ కార్యక్రమం భువనగిరిలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
ట్రస్మా ఆధ్వర్యంలో గురుపూజోత్సవం


