NRML: జిల్లా కేంద్రంలో వివిధ వార్డులలో ప్రతిష్టించిన వినాయక నిమజ్జన వేడుకలు ఆదివారం మధ్యాహ్నం ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమాలు ఆదివారం వరకు కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
ప్రశాంతంగా ముగిసిన గణేశ్ నిమజ్జనం


