హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సూర్యాపేటలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలి'

SRPT: సూర్యాపేట పట్టణంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో మేరు సంఘం నాయకులు పాల్గొన్నారు. తమకు జీవనోపాధి కల్పిస్తున్న కుట్టు మిషన్‌తో మేరు సంఘం మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. హైదరాబాద్-విజయవాడ బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ సాధించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.