హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండపై వెయ్యి అడుగుల ఎత్తులో కౌలాస్‌ కోట

KMR: జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ కోట పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. కొండపై సుమారు వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోటకు బలమైన రక్షణ వ్యవస్థ, బురుజులు, రెండు ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ద్వారాలపై కనిపించే శిల్పాలు, కాకతీయ రాజచిహ్నాల ఆనవాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కోట పరిసరాల్లో రామాలయం, హనుమాన్‌ ఆలయం, జగదాంబ ఆలయాలతో పాటు మసీదులు, దర్గాలు ఉన్నాయి.