NLG: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా, హైదరాబాద్ శాసన సభ సెంట్రల్ హాల్‌లో ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ నేతగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి


