హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐకేపీ గోదాంకు భూమిపూజ

SRCL: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలో నూతన ఐకేపీ గోదాంకు ఆయన భూమిపూజ చేశారు. దళారుల దోపిడీని అరికట్టి, రైతుల ఆదాయం పెంచేందుకే ఈ గోదాం అని, నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఐకేపీ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.