ADB: గాదిగూడ మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం కవిత అనే బాలింత ఇటీవల రిమ్స్ ఆసుపత్రిలో పసిపాపను జన్మనిచ్చి మూర్ఛ వ్యాధితో మృతి చెందింది. దీంతో ఆదివాసులు, 'అభిమన్యు' గ్రూప్ సభ్యులు ఐక్యమత్యంతో ఆదివారం రూ.82,200 ఆర్థిక సహాయాన్ని పాపకు అందజేశారు. అందులో నుంచే రూ.27 వేల ఒక ఆవు, లేగ దూడను ఇచ్చారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ
అనాథ పాపకు ఆర్థిక సాయం అందజేత


