SRCL: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలో జరిగిన 111వ జయంతి వేడుకల్లో విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన బాపూజీ సేవలు చిరస్మరణీయమని, పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మంత్రి


