హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం: రామ్ మాధవ్

TPT: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని వీక్షించారు. 'మన్ కీ బాత్' ప్రజల భావోద్వేగాలకు ప్రతిరూపమైన ప్రజా గొంతుక అని ఆయన పేర్కొన్నారు. 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో NDA విజయానికి కృషి చేయాలన్నారు.