హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాటర్ గ్రిడ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

PLD: కారంపూడి రోడ్డులోని MSME పార్క్ వద్ద జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా, రాయవరం జంక్షన్ నుంచి కారంపూడి వరకు నిర్మించనున్న 1300 ఎం.ఎం పైప్‌లైన్ పనులకు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేడు భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు. అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మీడియాకు వివరించారు.