హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

JGL: మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ ఈవో అంజనా రెడ్డి, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.