హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహేందర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

KNR: మానకొండూరు మండలం అన్నారం గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బందెల మహేందర్‌ను ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. ఇటీవల మహేందర్‌ తల్లి బంజారా లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. లక్ష్మి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి ధైర్యం చెప్పారు.