హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాపూజీ సేవలు చిరస్మరణీయం: ఈడీ

HYD: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ముషీరాబాద్‌లోని టీజీఎస్‌ఆర్టీసీ బస్‌భవన్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. TGSRTC ఈడీ సీహెచ్ వెంకన్న బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, తెలంగాణ సాధనకు చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.