హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి వీజీపీపీ సభలు

KMM: బోనకల్ మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో సోమవారం నుంచి ఈ నెల30 వరకు వికసిత్ గ్రామపంచాయతీ ప్లానింగ్ (వీజీపీపీ) గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రమాదేవి తెలిపారు. యాక్టివ్ జాబ్ కార్డుదారులకు జూన్ 2027 వరకు 125 రోజుల పనులు కల్పించేందుకు పనులను గుర్తించి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.