KMM: చింతకాని మండలం మత్కేపల్లి–పందిళ్లపల్లి వరకు చేపట్టనున్న పంచాయతీరాజ్ బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. రహదారి నిర్మాణంతో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
రోడ్డు నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన


