హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బులియన్ వ్యాపారుల సమావేశానికి ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట కోట సెంటర్‌లోని వాసవి కల్యాణ మండపంలో బులియన్ గోల్డ్, సిల్వర్ & డైమండ్స్ మర్చంట్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో 6వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. బులియన్ వ్యాపారుల సమస్యలు, వ్యాపార రంగ అభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.