హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొగత జలపాతంలో పర్యాటకుల సందడి

MLG: వాజేడు మండలంలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన బొగత జలపాతంలో వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు పర్యాటకులకు ఊరట కల్పించారు. గత రెండు రోజులుగా స్విమ్మింగ్ పూల్‌లోకి అనుమతి నిలిపివేయగా, ఆదివారం నుంచి కొలనులోకి దిగేందుకు అనుమతించారు. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి సందడి చేస్తున్నారు.