KMM: చింతకాని మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సందర్శించారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పూజలు


