హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మంలో బాపూజీ జయంతి వేడుకలు

KMM: కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని పురస్కరించుకుని ఖమ్మం నగర పాలక సంస్థలో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం బాపూజీ సాగించిన ఉద్యమం, ప్రజల కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.