హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ మారథాన్‌కు విశేష స్పందన

KNR: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన కరీంనగర్ మారథాన్‌ సందడిగా సాగింది. 3కే, 5కే, 10కే, 21కే విభాగాల్లో నిర్వహించిన పరుగులో ఐదేళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు సుమారు 5 వేల మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మున్సిపల్, పోలీస్, NSS వాలంటీర్లు సమన్వయంతో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు.