హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాపూజీ ఆశయాల సాధనకు ప్రభుత్వ కృషి'

JGL: కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని రాయికల్‌లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. గాంధీ తర్వాత బాపూజీగా పేరొందిన ఆయన పేరును సీఎం రేవంత్ ప్రభుత్వం చేనేత వర్సిటీకి పెట్టడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.