హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం స్ఫూర్తిదాయకం: SP

KMR: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం, ప్రజాసేవ.. నేటి తరానికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. SP మాట్లాడుతూ.. ఉద్యమం కోసం తన ఇల్లు, ఆస్తులను సైతం వినియోగించిన ఆయన త్యాగం చిరస్మరణీయమని వివరించారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.