హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

KNR: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగర మేయర్ శ్రీనివాస్, సంఘ పెద్దలు, సహ కార్పొరేటర్లతో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగుల ఆశాజ్యోతిగా, తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.