BHNG: తెలంగాణ సాధనతో పాటు బీసీల అభ్యున్నతికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన బాపూజీ జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకంగా పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'కొండా లక్ష్మణ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి'


