హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రజల కోసం జీవితాంతం పరితపించిన బాపూజీ'

ASF: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ హరిత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన జీవితకాలమంతా ప్రజల కోసం పరితపించిన గొప్ప నాయకుడని కలెక్టర్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బాపూజీ విశేషంగా కృషి చేశారని తెలిపారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో ఆయన పోరాట పటిమ మరువలేనిదన్నారు.