హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూచారంలో గ్రామసభ

MDK: మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో సర్పంచ్ రాజనాల చిత్ర రఘు అధ్యక్షతన ఆదివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల సోషల్ ఆడిట్‌పై  చర్చించారు. గ్రామంలో ఉపాధి కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పని కల్పించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.