BDK: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం ఐడీఓసీలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ అంకిత్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాపూజీ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన త్యాగాలు, సేవలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
బాపూజీ సేవలు చిరస్మరణీయం: కలెక్టర్


