హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ శతజయంతి వేడుకల్లో మాజీ మంత్రి

JGL: తెలంగాణ భవన్‌లో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో బాపూజీ చేసిన పోరాటం, ప్రజాసేవను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, ప్రజల కోసం చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.