హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొరాయిస్తున్న ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు

SRD: జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నా లేనట్లే తయారైంది. తాండూర్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు, జరా సంఘం వెళ్లే నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ నిరుపయోగంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ లైట్లను శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు చేయించాలని, ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.