హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

HYD: షాద్‌నగర్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీనవర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం బాపూజీ చేసిన పోరాటాలు, సేవలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు.